కోరుట్ల

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం జీఓ విడుదల చేయడం పట్ల ఖతర్ ఎన్నారైలు హర్షం

viswatelangana.com

September 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

గల్ఫ్ దేశం ఖతర్ లో కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎన్నారై ముహమ్మద్ నసీర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించడం పట్ల అబినందన ధన్యవాదాలు తెలుపుతూ, గల్ఫ్ కార్మికుల సంక్షేమం మొదలుకొని పిల్లల విద్యాభ్యాసం వరకు విధానాలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, గల్ఫ్ లో జీవనోపాధి పొందుతున్న వాళ్లు మరణిస్తే 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా ఇవ్వడం, ప్రజాభవన్ లో గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ప్రవాసి ప్రజావాణి కౌంటర్ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాదాన్యం వంటి విప్లవాత్మక అంశాలు ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ జీవో విడుదల చేసే విధంగా కృషి చేసిన గల్ఫ్ జేఏసీ బృందానికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై సెల్ బృందానికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా తోటి గల్ఫ్ కార్మికులతో పాటుగా తెలంగాణలో నాడు సకల జనుల సమ్మె చూసినాము, నేడు రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో సకల జనుల సంక్షేమం అభివృద్ధి చూస్తున్నాము అని ముహమ్మద్ నసీర్ అన్నారు.. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల వెంకటాపూర్ ముహమ్మద్ నసీర్, ఖాజా నవాజ్, కొన్నపల్లి శ్రావణ్, జనగం రమేష్, రాహీల్ ఖాన్, గోవింద్ మలవత్, బిబెక్ ఖడ్గా మరియు రాజేందర్ లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button