ముఖ్యమంత్రి సహాయ నిధి,కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

viswatelangana.com
మహిళా తల్లులను కోటీశ్వరులు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అందులో భాగంగా రాష్ట్రంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శనివారం కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో మహిళా సంఘం బిల్డింగ్ ను ప్రభుత్వ విప్ పరిశీలించారు.. అనంతరం అర్హులైన 88 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాది ముబారాక్ 14 లక్షల 23 వేల విలువ గల 33 ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ సిరికొండ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న మహిళా సంఘం భవనాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు.. భావన నిర్మాణం కోసం అవసరమైన నిధులు 15 రోజుల్లో మంజూరు చేస్తానని వచ్చే దసరా నాటికి సంఘ భవన నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయాల్సిందిగా తెలిపారు.సిరికొండ గ్రామంలో పార్టీలకు అతీతంగా 49 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు.దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారిందన్నారు.. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు.మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్ఓసి ల ద్వారా ఇప్పటి వరకు 20 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు.గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు సిలిండర్, 10 లక్షల అరోగ్య శ్రీ,నూతన రేషన్ కార్డులు, సన్నం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.దేశంలోని అసమానతలు తొలగించి కుల మత భేదం లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక రోల్ మోడల్ గా కుల గణన చేసి నిలిచిందన్నారు.. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుందన్నారు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ చేయడం జరుగుతుందన్నారు..



