రాయికల్

పోషణ పక్షోత్సవాలు

viswatelangana.com

April 16th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఇటిక్యాల సెక్టర్ లోని ఐదవ సెంటర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షోత్సవాల సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు మరియు ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసనలు నిర్వహించారు. గర్భిణీ దశ నుండి పిల్లలు రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు సంబంధించిన వెయ్యి రోజుల ప్రాముఖ్యత, పోషకాహారం, ఆరోగ్య పరీక్షల గూర్చి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మిల్లెట్స్, పాలు పండ్లు, కూరగాయలు, ఎగ్స్ వివిధ రకాల పోషక పదార్థాల ప్రాముఖ్యత గురించి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెల్త్ సూపర్వైజర్ ఉమారాణి, ఏఎన్ఎం లు భాగ్యలక్ష్మి, రజిత, అంగన్వాడి టీచర్ సుజాత, ఆశా కార్యకర్తలు సుమలత, వనిత, గర్భిణీలు బాలింతలు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button