కథలాపూర్

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎస్సై జి నవీన్ కుమార్

viswatelangana.com

September 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కథలాపూర్ మండల గ్రామాల్లోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కరెంటు స్థంభాలను, వైర్లను, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. చెరువులు, కుంటల వద్దకు సెల్ఫీల పేరిట ప్రమాదం కొని తెచ్చుకోవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షితమైన ఇంట్లోకి తరలి వెళ్ళాలన్నారు. వాగులు, ఒర్రెలు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయని, వాటిని దాటే ప్రయత్నంలో ప్రాణాలకు ప్రమాదం ఉందని, కావున వాటిని దాటా కూడా ఉండాలని, చెరువులు, కుంటలు నిండి అలుగులు దునుకుతున్న తరుణంలో చేపల వేటకు వెళ్లే వారు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని వాహనదారులు, ప్రజలు అత్యవసర విషయాల్లో తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు.

Related Articles

Back to top button