రాయికల్
నూతన కార్యవర్గం ఏకగ్రీవం

viswatelangana.com
June 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు పోతు మురళి, ఉపాధ్యక్షులు ఆడెపు మహేందర్, ప్రధాన కార్యదర్శి ఆడెపు మురళి, సహాయ కార్యదర్శి ఎలిగేటి మనోజ్, కోశాధికారి సిరిపురం సతీష్.ఈ సందర్భంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



