ప్రజా పాలన విజయోత్సవాలు

viswatelangana.com
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు విద్యాశాఖకు కేటాయించగా అందులో భాగంగా 01-12-2024 ఆదివారం రోజున జగిత్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు “ప్రజాపాలన-విజయోత్సవాలలో “భాగంగా ఇబ్రహీంపట్నం మండల స్థాయిలో “పునరుత్పాదక శక్తి వనరులు” ( పునరుత్పాదక ఇంధన వనరులు) పైన వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలో మండలం లోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ప్రథమ స్థానంలో టి.రూప్లాష,జెడ్పిహెచ్ఎస్ గోధుర్,ద్వితీయ స్థానంలో బి.సంతోషి ఎంపీహెచ్ ఎస్ కోజన్ కొత్తూరు, తృతీయ స్థానంలో జి హర్షిక జెడ్పిహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం లు గెలుపొందినారు. గెలుపొందిన విద్యార్థులకు మండల స్థాయి ప్రైజులు అందించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి బండారి మధు, కాంప్లెక్స్ ప్రధానోపాద్యాయులు ఎం.రాజన్న అన్ని పాఠశాలల ఉపాద్యాయులు మరియు ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొనడం జరిగింది



