కథలాపూర్

తప్పు ఎవరిది. బాధ్యులు ఎవరు.

viswatelangana.com

April 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపుర్ మండల కేంద్రంలోని మణికంఠ హీరో షోరూంలో కాశిరెడ్డి సందీప్ రెడ్డి అనే వ్యక్తి 4-9-2021 లో ఒక్క బైక్ ను కొనుగోలు చేసారు. అయితే ఇక్కడే సమస్య వచ్చింది ఆ బైక్ గ్లామర్ బైక్ తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడే సమస్య అతని టి.అర్ పేపర్లో గ్లామర్ కు బదులు హెచ్ఆఫ్ డీలక్స్ బైక్ అని షో రూం వారు ఇచ్చిన టి.అర్ పేపర్ లో వచ్చింది అట్టి టి.అర్ పేపర్ ఆధారితంగా ఆర్టీవో ఆఫీస్ లో కుడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సదరు కొనుగోలు దారుడు రిజిస్ట్రేషన్ చేసారు కదా అన్ని కరెక్ట్ గా ఉంటాయని అనుకోవడం జరిగింది, అయితే బైక్ యాజమాని రిజిస్ట్రేషన్ అయిన 6 నేలల తరువాత ఉపాధి నిమిత్తం సౌదీ దేశం వెళ్ళడం జరిగింది. మరల ఇండియా కీ తిరిగి వచ్చిన వెంటనే ఆ యొక్క బైక్ నీ అమ్మడానికి పెట్టారు. అలా పెట్టక ఆయన దగ్గరి నుండి కొనుగోలు చేసే వ్యక్తి అట్టి అర్సి కార్డ్ పై గ్లామర్ కు బదులు హెచ్ఆఫ్ డీలక్స్ పేరు వచ్చిందని తెలుపడంతో మణికంఠ షో రూం యాజమాని వద్దకు వెళ్ళారు. వెళ్ళి ఆయనను అడగగా ఇది న తప్పిదం కాదని ఆర్టీవో తప్పిదం అని బైక్ కొనుగోలు దారునిపై అవేసంతో బెదిరించడం జరిగిందని బాధితుడు తెలిపారు. అనంతరం బాధితుడు కొరుట్లలోని ఎంవీఐ ఆఫీస్ లో అట్టి షోరూం పై పిర్యాదు చేసారు. ఇట్టి పిర్యుదు వల్ల ఏటువంటి చట్ట పరమైన చర్యలు తీసుకుంటారో అని బాధితుడు వాపోతున్నాడు. అలాగే గతంలో కుడా కథలాపుర్ మణికంఠ షోరూం పై ఇలాగే పిర్యాదులు వచ్చాయని వినికిడి

Related Articles

Back to top button