రాయికల్
పరీక్ష ప్యాడ్ ల పంపిణీ

viswatelangana.com
March 11th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలం ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ కడార్ల చంద్రశేఖర్ సోమవారం పదవతరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్ లు పెన్నులు అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి పేరు తేవాలని సూచించారు. వారం రోజుల్లో ఇష్టంతో పట్టుదలగా చదివితే మంచి గ్రేడింగ్ తో ఉత్తీర్ణత సాధించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్ముల ఆదిరెడ్డి ప్రధానోపాధ్యాయులు యస్ సదాశివ్ ఉపాధ్యాయులు గాజెంగి రాజేశం చెరుకు మహేశ్వర శర్మ ఎద్దండి రమేష్ శాంతకుమారి జియావోద్దీన్ హన్మంతరావు వి.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



