కథలాపూర్
ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలోని ఎస్ డి ఎఫ్ నిధుల క్రింద మంజూరైన మహిళా సంఘం భవనంకు భూమి పూజ

viswatelangana.com
March 14th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని కలికోట గ్రామంలో మహిళా సమైక్య సంఘం సభ్యులకు భవన నిర్మాణం కొరకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎస్ డి ఎఫ్ నిధుల కింద మంజూరు చేసిన నాలుగు లక్షల రూపాయలుతో భవన నిర్మాణం కొరకు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం. మహిళా సంఘం సభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో గ్రామంలోని యువతి యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘం సభ్యురాలు గ్రామ స్పెషల్ ఆఫీసర్ గ్రామ మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు



