రాయికల్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి

viswatelangana.com

April 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ నాయకులు మాట్లాడుతూ గోల్కొండ కోట జయించి బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి శ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జవ్వాజి నర్శాగౌడ్, గ్రామ నాయకులు కాటిపల్లి గంగారెడ్డి, సామల్ల వేణు, ఆదిరెడ్డి, మహిపతి రెడ్డి, కంటే విష్ణు, కొల్లూరు వేణు, గౌడ సంఘ సభ్యులు, నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button