జగిత్యాల

జగిత్యాల జిల్లా లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

viswatelangana.com

May 13th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు సంబందించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా మల్యాల, కొడిమ్యాల, జగిత్యాల, మల్లాపూర్ లలో ఈవీఎం లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కాస్త ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. రాయికల్ మండలంలో పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లో ఉన్న ఓ పార్టీ గుర్తు ఉబ్బేత్తుగా ఉండటం పై ఏజెంట్లు అభ్యంతరం తెలుపగా అధికారులు వాటిని సరి చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా పర్యవేక్షించగా పోలింగ్ సెంటర్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్ తో పాటు పలువురు ఉదయమే ఓటు వేశారు.

Related Articles

Back to top button