అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరు ముందుకు రావాలి

viswatelangana.com
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాష అన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ పార్కులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావిగా అంబేద్కర్ గుర్తింపు పొందారన్నారు. సమాజంలో కుల వివక్ష నశించి ప్రతి ఒక్కరూ సమానంగా ఉండేందుకు నిరంతరం కృషి చేశారన్నారు. అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఆయన రచించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ముందు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సి డైరెక్టర్ సంగు గంగాధర్, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందె మారుతీ, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అమ్ముల పవన్, ముద్దం ప్రశాంత్, కోరే రాజ్ కుమార్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.



