విశ్వ శాంతి హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు
viswatelangana.com
చంద్రశేఖర వెంకట రామన్ జయంతి ని పురస్కరించుకొని కోరుట్ల పట్టణం లోని విశ్వశాంతి హై స్కూల్ లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ బ్రహ్మన్న గారి శంకర్ శర్మ,ప్రిన్సిపాల్ చీటీ సత్యం రావు లు విద్యార్థులు తయారు చేసిన సైన్స్ నమూనాలను తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన, ఆసక్తి కల్పించి తద్వారా వారిలో సైన్స్ లో ప్రయోగాలు చేసేలా ఉపయోగ పడుతుందని అన్నారు. సీవీ రామన్ కు 1930లో నోబెల్ అవార్డ్ లభించిందని అందుకే ఆయన పేరు మీద 1987వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28 సైన్స్ దినోత్సవంగా ప్రకటించారని ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతూ విద్యా, బుద్ధులు నేర్పిన గురువులను సత్కరించుకోవడం సాంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



