కోరుట్ల
సాంకేతిక కారణాలతో రుణమాపీ కాలేదని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు వినతి పత్రం

viswatelangana.com
August 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ విప్&ఏమ్మెల్యే వేములవాడ అది శ్రీనివాస్ ను కలసి కెనరా బ్యాంక్ అలాగే యూనియన్ బ్యాంక్ లో రుణము తీసుకున్న రైతులకు సాంకేతిక కారణాలతో రుణమాపీ కాలేదని ఇట్టి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రుణ మాపి జరిగేవిదంగా చూడాలని రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావుతో కలసి వినతి పత్రం ఇచ్చిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ & ఏమ్మెల్యే అది శ్రీనివాస్ మాట్లాడుతూ…ఇట్టి విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డికి వివరించి అందరి రైతులకు మాపి వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, దిలీప్ గౌడ్, అల్లూరి సుకుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, నేరెళ్ల శ్రీధర్, రాజరాపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.



