జగిత్యాల
డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్ మాదిగ యువజన సంఘం నూతన కమిటీ పదవి ప్రమాణ స్వీకారం
viswatelangana.com
February 18th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్ లోని డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్ మాదిగ యువజన సంఘం నూతన కమిటీ అధ్యక్షుడు శనిగరపు రాజేష్, ఉపాధ్యక్షుడు శనిగరపు నరేష్, ప్రధాన కార్యదర్శి మోర్తాడ్ రాజశేఖర్, కోశాధికారి చిట్యాల ప్రభాకర్, అరుంధతి భవన్లో ఆదివారం నాడు ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సంఘా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మాదిగ యువజన సంఘం ఎన్నికల కమిటీ సభ్యులు చిట్యాల శ్రీనివాస్, బాపురపు వెంకట్, చిట్యాల లచ్చయ్య, మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, చిట్యాల భూమయ్య, పేట భాస్కర్, తెడ్డు నడ్పి రాజం, చిట్యాల లక్ష్మణ్, బెక్కం అశోక్, రామిండ్ల రాంబాబు మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు.



