ఉపాధి పని ప్రదేశం లో అన్ని సదుపాయాలను కల్పించాలి డిఆర్డిఓ సంపత్ రావు

viswatelangana.com
ఎండాకాలం దృష్ట్యా ఉపాధి పని ప్రదేశం లో సదుపాయాలను కల్పించాలని జగిత్యాల డిఆర్ డి ఓ (మండల ప్రత్యేక అధికారి) సంపత్ రావు అన్నారు . ఉపాధి హామీ పథకం లో భాగంగా శనివారం రాయికల్ మండలం కిష్టంపెట్ గ్రామములో జరుగుతున్న నిరవధిక కందకం ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల వేతనాలు ఏప్రిల్ నెల నుండి 300 రూపాయలకు ప్రభుత్వం పెంచడం జరిగిందని, కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ మూడు నెలల్లో కూలీలు 100 రోజులు పని పూర్తి చేసినట్లయితే 30 వేల వేతనం పొందవచ్చునని అన్నారు. ఎండలు తీవ్రత దృష్ట్యా కూలీలకు పని ప్రదేశంలో అన్ని సదుపాయాలు కల్పించాలని, ఓ ఆర్ ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఏపీవో దివ్య, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ కుమార్, రాము, వేణు, అమర్, కార్యదర్శి వేణుగోపాల్, మేట్ కందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.



