కోరుట్ల

మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేసిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

June 16th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నూతనంగా నియమితులైన మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి లను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని సచివాలయ మంత్రుల నివాస సముదాయానికి చేరుకున్న జువ్వాడి కృష్ణారావు, మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, కరీంనగర్ జిల్లా మాజీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి, సైదు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button