కోరుట్ల

వెంకట్రావు పేట పాఠశాల లో పదోన్నతి పొందిన వారికీ సన్మానం

viswatelangana.com

October 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మెట్ పల్లి రెవిన్యూ డివిజన్ 11వ వార్డు లోని యు.పి.ఎస్ వెంకట్రావు పేట పాఠశాలలో ఇటీవల పదోన్నతి పొందిన మెట్ పల్లి మండల విద్యాధికారి మ్యాకల చంద్ర శేఖర్, హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన అల్లకట్టు సత్యనారాయణ, వెంకట్రావు పేట పాఠశాల నుండి ఇబ్రహీంపట్నం, డబ్బా పాఠశాల కు వెళ్లిన వారికి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గా పదోన్నతి పొందిన లోకా వెంకట రమణ రెడ్డి, ఇటీవలే వెంకట్రావు పేట పాఠశాల నుండి రాజేశ్వర్ రావు పేట పాఠశాల కు వెళ్లారు. ఈ సందర్బంగా వెంకట్రావు పేట పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వసంత రావు, కౌన్సిలర్, కోమిరెడ్డి జ్యోతి -శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మమత, ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు కలసి సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంజయ్య, శ్రీకాంత్, పెరంబుడూర్ వికాస్, సరిత, అండాలు అలాగే అలాగే అంగన్వాడీ టీచర్ కోల పావని, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button