కథలాపూర్
శతాధిక వృద్దురాలు పానుగంటి దుర్గవ్వ(111) మృతి

viswatelangana.com
April 10th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో శతాధిక వృద్దురాలు పానుగంటి దుర్గవ్వ (వయస్సు 111 సంవత్సరాలు) బుధవారం రోజున సాయంత్రం 7 గంటలకు చనిపోయింది. ఆమె కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.పెద్ద కుమారుడు ముత్తయ్య, చిన్న కుమారుడు వెంకటి, కుమార్తెలు ముత్త, గంగు, రాజగంగు మరియు మనుమలు, మనుమరాళ్లు రాజు, మహర్షి, మహాత్మ, మహస్త్య, సోను, చిన్ను మరియు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు



