కథలాపూర్
కాంగ్రెస్ లో చేరిన కథలాపూర్ సర్పంచ్ ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు

viswatelangana.com
May 5th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, పోసానిపేట తాజా మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి( ఎంజి రెడ్డి), సింగిల్ విండో డైరెక్టర్ క్యాతం అనంత్ రెడ్డి, ఆకుల రాజేందర్ ఎన్నారై , బిఆర్ఏస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రామల్ల అశోక్, గడ్డం జలపతి రెడ్డి,గౌడ సంగం అధ్యక్షులు పోడేటి రాము గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు గంగాధరి చిన్న రెడ్డి, ఒలవేని నరేష్, లు ఆదివారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.



