కోరుట్ల
స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత,” సంపూర్ణ స్వచ్ఛత
(స్వచ్ఛత లక్షిత్ ఏకైతో సహా) "స్వచ్ఛతా కీ భాగీదారీ" ప్రజల భాగస్వామ్యం, అవగాహన మరియు న్యాయవాదం

viswatelangana.com
September 29th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణం లోని యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి రైల్వే స్టేషన్ అలాగే పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో దాదాపు 35 మంది యువకులు భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ పట్టణంలోని యువకులు అలాగే స్వచ్ఛంద సేవ సంఘాలు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గొనేల మహేష్, కోరుట్ల పట్టణ యువకులు అలాగే మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



