మెట్ పల్లి
రాష్ట్ర స్థాయి పోటీలకు బ్రిలియంట్ విద్యార్థులు ఎంపిక
viswatelangana.com
January 30th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
- జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటిల్లో సత్తా చాటిన విద్యార్థులు
జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటిల్లో సత్తా చాటారు. పరుగు పందెం అండర్ 8 విభాగంలో ఎస్ నిహాల్ రెండవ స్థానంలో నిలవగా, స్టాండింగ్ బ్రాడ్ జంప్ బాలికల విభాగం లో లక్ష్మీ ప్రసన్న మొదటి స్థానంలో, రెండవ స్థానం లో దీప్తి మరియు బాలుర విభాగం లో మొదటి స్థానంలో ఎస్ నిహాల్, రెండవ స్థానంలో సీ హెచ్ అఖిల్, మూడవ స్థానంలో ఎండీ సఫాన్ నిలిచారు. అంతే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం లో జరుగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ప్రిన్సిపాల్ ప్రశాంత్ గౌడ్, పిఈటి భవాని మరియు ఉపాధ్యాయులు అభినందించారు.




