రాయికల్
ఘనంగా గంగాదేవి బోనాలు

viswatelangana.com
May 17th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని పెద్ద చెరువు గట్టు మీద నెలకొన్న గంగాదేవి ఆలయం లో శుక్రవారం గంగపుత్రసంఘం సభ్యులు ఘనంగా బోనాల ఉత్సవాలు జరిపారు ఈ సందర్భంగా ఆలయంలో పురోహితులు చెరుకు మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు గంగా శివుని కళ్యాణోత్సవం హోమం నిర్వహించారు చెరువు లను కాపాడుకోవడమే గంగమ్మ ఉత్సవాల ప్రత్యేకత అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గంగపుత్రసంఘం అధ్యక్షులు కామని రజనీ కుమార్ కార్యదర్శి హరీశ్ కుమార్ ఉపాధ్యక్షులు చంద్ర ప్రకాశ్ సభ్యులు మాసపేట మల్లయ్య వెంకట్రాజం తెలుగు పండితులు కామని లక్ష్మయ్య సూర్యప్రకాశ్ రాజేశం భూమరాజం కామని నరేశ్ తోపారపు రమేశ్ అరవింద్ ప్రభాస్ మాసపేట రాజ్ కుమార్ చిన్న నర్సయ్య గంగాధర్ మురళి పల్లి కొండ లక్ష్మీ నారాయణ పురోహితులు చెరుకు మధుసూదన్ మహేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు



