కొడిమ్యాల

రైతులకు పామాయిల్ పంట సాగుపై అవగాహన సదస్సు

viswatelangana.com

April 16th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల గ్రామంలో పామాయిల్ పంట సాగు లాభాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అవకాశం ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా పామాయిల్ సాగు చేపట్టాలని,ఈ పంట సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు తెలపడం జరిగింది. ప్రస్తుతం టన్ను ధర సుమారు 21000/- మద్దతు ధర ఉందని,ఈ ధరతో సరాసరి రైతుకు లక్ష యాభైవేల నుంచి రెండు లక్షల వరకు గిట్టుబాటు ఉంటుందని తెలుపడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి మొక్కకు 90% రాయితీతో 20/- రూపాయల చొప్పున ఎకరానికి 57 మొక్కలకు గాను1140/- డిడి కట్టి పామాయిల్ సాగుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలపడం జరిగింది.డ్రిప్ పరికరాలకు పెద్ద రైతులకు 80% , చిన్న సన్నకారు రైతులకు 90 శాతం,ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% రాయితీ కలదు.ఆయిల్ పామ్ 1993 చట్టం ప్రకారం ప్రతి గేలను రైతు నుంచి కొనుగోలు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కావున అవకాశం ఉన్న ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేసి లాభాలు పొందాలని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈ ఓ, కె ప్రశాంత్, ఏఎం సి, వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి, లోహియా కంపెనీ ప్రతినిధి ఎన్.అనిల్, రైతులు పాల్గొనడం జరిగింది.

Related Articles

Back to top button