భీమారం
లక్ష్మి నరసింహస్వామి కళ్యాణానికి హాజరైన ప్రభుత్వ విప్
viswatelangana.com
February 24th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా భీమారం మండలం ఓడ్యాడ్ గ్రామంలో శనివారం రోజున నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో వేములవాడ శాసనసభ సభ్యులు , తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ప్రజల బాగోగులు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మార్గం నరసారెడ్డి, లక్ష్మణ్, లచ్చనాయక్, శంకర్, నాగరాజు, స్వామి, జలంధర్, వినోద్, గంగాధర్, సాగర్, సయ్యద్, అజేయ్ సంజీవ్, ప్రశాంత్, జీవన్, చంద్, శ్రీకాంత్, గంగారెడ్డి, అరుణ్ గ్రామ ప్రజలు తదిరులు పాల్గొన్నారు.



