జగిత్యాల
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

viswatelangana.com
June 15th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నియామకం అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సత్య ప్రసాద్ ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్గా పని చేశారు. కాగా జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషను బదిలీ చేశారు.



