కాంగ్రెస్ సేవాదళ్ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ గద్దె నరహరి ఆధ్వర్యంలోసమావేశం

viswatelangana.com
- ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి జీవన్ రెడ్డి ని, అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటే అభివృద్ధి పథంలో అడుగు వేసినట్లు అవుతుందని జువ్వాడి నరసింగరావు కొనియాడారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కి సేవాదళ్ వెన్నముక లాంటిదని కొనియాడారు, రానున్న ఎలక్షన్ కాంగ్రెస్ సేవాదళ్ కు ప్రాధాన్యతనిస్తానన్నారు, శ్రీగద్దె నరహరి మాట్లాడుతూ కాంగ్రెస్ కి అన్నివేళల అందుబాటులో ఉండి సేవ చేస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు, జువ్వాడి కుటుంబానికి తను ఎల్లవేళలా రుణపడి ఉంటారని చెప్పారు, ఈ కార్యక్రమంలో మూడవ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, సోగ్రాభి కాంగ్రెస్ నాయకులు వీరబత్తిని దశరథం, కటుకం దివాకర్, వన తడుపుల వెంకటేష్, తాళ్ల పెళ్లి శ్రీనివాస్, ఆనంద్ గౌడ్ కాంగ్రెస్ సేవాదళ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



