కొడిమ్యాల
మాస శివరాత్రి గుండప్ప శివాలయంలో ప్రత్యేక పూజలు

viswatelangana.com
March 28th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మాస శివరాత్రి పురస్కరించుకొని కొడిమ్యాల గుండ్రప్ప శివాలయంలో శివ లింగం కు పంచామృత అభిషేకం, అన్న పూజ లింగాష్టకం పారాయణం ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి హనుమాన్ దేవాలయం శ్రీ హనుమాన్ దండకం, చాలీసా పారాయణ చేసి ఆ తదుపరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి. రాహుల్-భావన (కే డి సి సి బ్యాంక్ ఆఫీసర్) ఆలయముకు అన్న ప్రసాద వితరకు 5000 రూ/-విరాళంగా ఆలయ అందజేశారు అర్చకులు భాస్కర్ పంతులు భక్తులు హనుమాన్ దీక్ష స్వాములు యువకులు మాత సాములు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు హనుమాన్ సేవా సమితి సభ్యులు తెలియజేశారు



