కోరుట్ల

16న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పిలుపు

viswatelangana.com

February 10th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల ప్రతినిధి: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఈనెల 16న దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు ఉద్యోగులు ప్రజానికం అందరూ భారత్ బంద్ పిలుపును జాయింట్ వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చారుశనివారం రోజున సి ప్రభాకర్ భవన్లో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె భారత్ బంద్ కు సన్నాహక జిల్లా సదస్సు జరిగిందికార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం 10 ఏండ్ల కిందట నుండి అధికారంలోకి వచ్చి చేసింది ఏమీ లేదన్నారు విదేశాల నుండి నల్లధనం తిరిగితే తెప్పిస్తామని మోసం చేశారని నోట్లను రద్దుచేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెనుబారం మోపాడని విమర్శించారు కనీస వేతన జీవోలు కనీస పెన్షన్లను వెంటనే సవరించాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని కేంద్రంలోని అన్ని రంగాల స్కీం వర్కర్స్ అయినా బీడీ అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు ఆశా వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని హమాలి మున్సిపల్ గ్రామపంచాయతీ ఈఎస్ఐ పిఎఫ్ బీమా పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ జిల్లా సదస్సులో జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు టేకుమల్ల సమ్మయ్య సుతారి రాములు ఎండి ముక్కురం చౌదరి జిందం ప్రసాద్ చింత భూమేశ్వర్ కొక్కుల శాంత గాజంగి రాజేశం గంగాధర్ లక్ష్మి వెన్న మహేష్ ఎండి ఉస్మాన్ కిరణ్ శ్రీగాళ దేవదాస్ ఎన్నం రాధా భీమయ్య తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button