స్వచ్ఛత హి సేవపై విద్యార్థులకు అవగాహన

viswatelangana.com
స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 లో భాగంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్ లోని జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి, పిల్లలను స్వచ్ఛత హి సేవ లోని అక్షరాల మాదిరిగా నిలబెట్టారు. అలాగే విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించి, వ్యాసరచన పోటీ నిర్వహించారు. అంతేకాకుండా పాఠశాల విద్యార్థులు స్వచ్ఛందంగా పాఠశాల పరిసరాలను శుభ్రం చేసారు. ఈ స్వచ్ఛత హి సేవ కార్యక్రమము లో భాగం గా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 1 వరకు పట్టణంలోని ప్రజలకు మరియు విద్యార్థిని, విద్యార్థులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ పట్టణమును పరిశుభ్రంగా ఉంచడం కోసం కృషి అక్టోబర్ 2న స్వచ్ఛతపై కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గోనెల మహేష్, హేమంత్, గౌతమ్, మున్సిపల్ సిబ్బంది అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



