కథలాపూర్
ఊట్ పల్లి గ్రామంలో ఆసక్తికరంగా స్మారక వాలీబాల్ టోర్నీ

viswatelangana.com
January 10th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో స్మారక ఉమ్మడి కరీంనగర్ & నిజామాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అందులో 60 జట్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఊట్ పల్లి సీనియర్ క్రీడాకారులు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించి ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఉన్నతంగా ఎదిగి గ్రామానికి తద్వారా దేశానికి మంచి పేరు తీసుకురావాలని, దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లోనే ఉంటుందని యువకులు పెడదారి పట్టకుండా వ్యసనాలకు లోను కాకుండా ఆదర్శంగా నిలవాలని, టోర్నమెంట్ ప్రథమ స్థానం విజేత జట్టుకు రూ. 15000, రెండో స్థానం పొందిన జట్టుకు రూ.10000, మూడో స్థానం పొందిన జట్టుకు రూ.5555, 4వ స్థానం పొందిన జట్టుకు రూ.3333 ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



