
viswatelangana.com
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, అధికారులు వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం జువ్వాడి నర్సింగారావు కోరారు. సోమవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తాళ్ళచెరువు మత్తడి, ఐలాపూర్, ప్రకాశం, కల్లూరు రోడ్డు, వాగు శివారు ప్రాంతాలలోని వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా వరద రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదముల వల్లే రాష్ట్రం మొత్తం వరదమయం అవుతుందని ఆరోపించారు. కోరుట్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని తెలిపారు. ఆయన చేసిన తప్పిదాల వల్లే కోరుట్ల పట్టణంలో నీరు సక్రమంగా వెళ్ళక ఇళ్లల్లోకి వరద నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం ఉన్నచోట పెద్ద మురికి కాలువలను నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రాంతంలో నివాసం ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలలో ఉండాలని కోరారు. పట్టణంలోని వరద ప్రాంతాల ను సర్వే చేసి కావాల్సిన నిధులు కేటాయించి ప్రజలను వరదల నుండి కాపాడుతామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారని, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. వరద ప్రాంతాల అభివృద్ధి కోసం వెంటనే నిధులు మంజూరు అయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి మంజూరీ చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్న అనిల్, కౌన్సిలర్లు జిందం లక్ష్మీనారాయణ, నజ్జు, పిసిసిఎస్ చైర్మన్ ఎలిసెట్టి భూమిరెడ్డి, నాయకులు నయీమ్, పుప్పాల ప్రభాకర్, రహీం, చిట్యాల లక్ష్మీనారాయణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.



