రాయికల్

ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

viswatelangana.com

April 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో ఎల్లమ్మ ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అరవన్నంతో నైవేద్యం సమర్పించారు. భక్తులు 50 రూపాయల నోట్లను మాలగా చేసి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిన్న కిష్ఠయ్య, ఉపాధ్యక్షులు తిరుపతి, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి బత్తిని శ్రీనివాస్, సభ్యులు మహేష్, అంజయ్య, రవి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button