గంభీర్ పూర్ లో ఇసుక వ్యాపారం ఆపాలంటూ ఎమ్మార్వో కు వినతి పత్రం
viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల గంభీర్ పూర్ గ్రామానికి చెందిన రజక సంఘం మరియు కురుమ యాదవ సంఘం సభ్యులు ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది వివరాల్లోకి వెళితే ఇరు సంఘాల సభ్యులు మాట్లాడుతూ మాకు ఉన్నటువంటి ధోపి గాడ్ మార్కండేయశ్వర స్వామి మరియు బీరప్ప స్వామి మరియు ఇతర కులాల వ్యవసాయ భూముల కొరకై నాటి కాలం నుండి ఓకే దారి ఉంది. కానీ ఇట్టి దారి నుండి ట్రాక్టర్లు ద్వారా ఎలాంటి అనుమతి లేకుండా విచ్చలవిడిగా ఇసుక రవాణా రాత్రి మరియు ఉదయం అన్ని వేళలో గంభీర్ పూర్ మరియు తాండ్రియాల గ్రామాల ట్రాక్టర్ల ద్వారా పైన ఉన్నటువంటి వాటికి ఇబ్బందు లకు గురి చేసే విధంగా సహజ సంపదను ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ రవాణా అరికట్టడానికి అనగా శుక్రవారం నాడు 01/03/24 నాడు రజక (చాకలి) కులస్తులం అయినా మేము అందరం కలిసి గ్రామ మాజీ సర్పంచ్ కి మరియు ఎంపీపీ కి ఇట్టి విషయాన్ని తెలిపి. అక్రమ రవాణా జరగకుండా ట్రాక్టర్లను పోరాకుండా కందకాలు తీయడం జరిగింది ఇట్టి విషయంపై లంకదాసరి చిన్న వెంకటి అను వ్యక్తి ఇంటి అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లా వద్ద పైసలు తీసుకొని వారికి సహకరిస్తూ కులస్తులైన మాపై బూతులు మాట్లాడుతూ ఇసుకపై సర్వహక్కులు నావి అంటూ మీరు కానీ మరి ఏ ఆఫీసర్ అయిన నన్ను అడ్డగించిన ఎవరైనా వారి సంగతి చూస్తానని ఏ అధికారైన అడ్డగిస్తే వారి సంగతి కూడా చూస్తానంటూ దుర్భాషలాడారని లంక దాసరి చిన్న వెంకటి సన్నాఫ్ ఎర్రయ్య లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో కి వినతి పత్రం ఇచ్చారు



