రాయికల్

నాటు సారా స్వాధీనం

viswatelangana.com

April 10th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొత్తపేట, మూటపల్లి,వస్త్రపూర్, తాట్లావాయి గ్రామాలలో ఉదయం 4 గంటలనుండి నాటుసారాయి రవాణా చేస్తున్నారానే సమాచారం తో ఎక్సైజ్ సీఐ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో సిబ్బంది రూట్ వాచ్ నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు ద్వీచక్ర వాహనాలపై నాటుసారాయి రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడ్డారు. వారినుండి 10 లీటర్ల సారాయి ని మరియు రెండు ద్వీచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో తాట్లావాయి గ్రామానికి చెందిన బాణావత్ శ్రీను నుండి 5 లీటర్ల సారాయి, ద్వీచక్ర వాహనం,వస్త్రపూర్ గ్రామానికి చెందిన గుగులోత్ వెంకటేష్ నుండి 5 లీటర్ల సారాయి, ద్వీచక్ర వాహనం ను స్వాధీనం చేసుకున్నారు. సారాయి రవాణా చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని సీఐ సర్వేశ్వర్ తెలిపారు. ఈ దాడులలో ఎస్ ఐ రాజేందర్, సిబ్బంది కిషోర్, రమేష్, కిరణ్, బీరయ్య, దేవేందర్ లు పాల్గొన్నారు. జగిత్యాల స్టేషన్ పరిధిలో ఎవరైనా నాటుసారా తయారు చెయ్యడం,కలిగి ఉండటం, అమ్మడం, రవాణా చెయ్యడం మరియు నాటుసారా ముడిసరుకు కలిగి ఉన్నట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల అబ్కారీ సీఐ సర్వేష్ తెలియచేశారు.

Related Articles

Back to top button