కోరుట్ల

ఆటో ఢీ కొని 16 నెలల బాలుడు మృతి

viswatelangana.com

April 6th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అంబేద్కర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 16 నెలల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా తాగునీరు సరఫరా చేసే ఆటో వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. స్థానిక ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిశీంద్ర అపూర్వ దంపతుల కుమారుడైన సుధన్వన్ (16 నెలలు) శనివారం ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనతో కోరుట్లలో విషాద చాయలు అలుముకున్నాయి.

Related Articles

Back to top button