అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్షం కార్యక్రమాల్లో సుధారాణి

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గౌరవపూర్ గ్రామంలో పోషణపక్షం కార్యక్రమాలను ఐసిడిఎస్ మల్యాల ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1000 రోజుల ప్రాముఖ్యత అనగా గర్భస్థ శిశువు నుండి పిల్లలు పుట్టిన రెండూ సంవత్సరముల వరకు 1000 రోజులు అంటారు. ఈ 1000 రోజులలో పిల్లల అభివృద్ధి పెరుగుదలను గూర్చి 80/. పిల్లలలో జరిగే అభివృద్ధిలను తెలియజేయడం జరిగింది పిల్లలు మరియు, గర్భిణీల బరువులు తీయడం జరిగింది పెరుగుదల అనేది పిల్లలలో ఎలా జరుగుతుంది పోషణ స్థితి పిల్లలలో ఎలా ఉంది అనేది తెలియజేయడం జరిగింది అలాగే గర్భిణీల ఇంటికి వెళ్లి గృహ సందర్శన చేసి వారికి తగు సలహాలు సూచనలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్సుధారాణి, అంగన్వాడీ టీచర్లు ఏ మంజుల, తల్లిదండ్రులు గర్భిణీలు హాజరు కావడం జరిగిందనిసుధారాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ తెలిపారు



