కోరుట్ల

అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి వారి దేశాలకు తిరిగి పంపించాలని బిజెపి కోరుట్ల పట్టణ శాఖ ఆర్.డి.ఓ కి పిర్యాదు

viswatelangana.com

May 7th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్లలో పలు ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ విదేశీయులను గుర్తించి వారి దేశాలకు పంపించాలని బిజెపి కోరుట్ల పట్టణ శాఖ నాయకులు ఆర్డిఓ ఆఫీసర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల బిజెపి పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో ఇటీవల పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా ప్రవేశించిన వలసదారులు ఉన్నారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని, వీరి వల్ల భద్రత సమస్యలు భవిష్యత్తులో సామాజిక అవాంఛనీయతలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. కావున గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి వెంటనే స్పందించి వలసదారులుగా వచ్చి అక్రమంగా నివాసముంటున్న విదేశీయులను గుర్తించి వారి ఆధారిత పత్రములను విచారణ చేసి వారిని చట్టపరంగా తగిన చర్యలు తీసుకొని వారిని వారి దేశాలకు పంపించవలసినదిగా చర్యలు తీసుకోవాలని గౌరవ రెవెన్యూ డివిజన్ అధికారిని కోరారు. ఇట్టి విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సవినయంగా మనవి చేశారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా నాయకులు ఇందూరి తిరుమల వాసు, సుదవేనీ మహేష్, అధ్యక్షులు ఎర్ర రాజేందర్, ఓల్లోజి నగేష్, సాడిగే మహేష్, కలాల సాయి చందు, మేకల గణేష్, దమ్మ సంతోష్, మండల నాయకులు రాజేందర్ రెడ్డి ప్రశాంత్, రాహుల్ గౌడ్ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button