అదనపు వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సాయంత్రం సుమారు 06:00 గంటలకు కొడిమ్యాల గ్రామానికి చెందిన దుబ్బాక జమున, వయస్సు 26 సంవత్సరాలు, కులం మాదిగ , ఆత్మహత్యకు పాల్పడిందాని ఆమె కు గత సంవత్సరం మార్చిలో దుబ్బాక రాహుల్ తో, వివాహం జరుగగా, 6 నెలల నుండి ఆమెను తన భర్త దుబ్బాక రాహుల్, మామ దుబ్బాక లక్ష్మినారాయణ అదనపు వరకట్నం కోసం వేదింపులకు గురిచేయడం వలన తన జమున, జీవితం పై విరక్తి చెంది కొడిమ్యాల గ్రామంలో గల తన అత్తగారి ఇంట్లో ఫినాయిల్ తాగి, చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునగా 21-04-2025 సాయంత్రం 06:00 గంటలకు జగిత్యాల్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా 22-04-2025 సాయంత్రం 08:00 గంటలకు మరణించిందని తన యొక్క తల్లి కొమ్ము పోషవ్వ r/o బుగ్గారం ఫిర్యాదు ఇవ్వగా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై సందీప్, తెలిపారు



