తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ‘గల్ఫ్ సంక్షేమ బోర్డు’ ఏర్పాటు పట్ల హార్షం -జిల్లా గ్రంథాలయ సంస్థ మజీ డైరక్టర్ గుగ్గిల్ల సురేష్ గౌడ్

viswatelangana.com
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడినా 10 నెలలోనే గల్ఫ్ కార్మికుల విషయంలో తమ చిత్తశుద్దిని నిరూపించుకున్నారాని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగ్గిల్ల సురేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ… గల్ఫ్ కార్మికుల కష్టాలను గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు అని, తెలంగాణ రాష్ట్రంలోని చాలా మంది కార్నికులు జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్ళి దురదృష్టవసత్తు మరణించినా కుటంబాలను కూడా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని, “గల్ఫ్ అడ్వెంజర్ బోర్డ్ ” ఏర్పాట చేస్తూ జీవో ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఇట్టి జీవో లో (1) గల్ఫ్ కు జీవనోపాధి కోసం వెళ్లి దురదృష్ట వశత్తు వ్యక్తి మరణించినట్లయితే ఆ వ్యక్తి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందించడం. (2) గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా “ప్రవాస ప్రజావాణి” కౌంటర్ ఏర్పాటు చేయడం. (3) గల్ఫ్ కార్నికుల పిల్లల చదువుల కోసం గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వటం వంటి నిర్ణయం తీసుకుని వాటిని జీవో రూపంలో ఉత్తర్వులు ఇవ్వటం కోసం కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డి కి, మంత్రిమండలికి అదేవిధంగా గల్ఫ్ కార్నికుల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీ, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, అలాగే గల్ఫ్ జేఏసీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



