ఆయిల్ ఫామ్ సాగు నాటిన నాలుగు సంవత్సరాలలో టన్నులు ఖాయాడం పక్కా

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో అవకాశం ఉన్న రైతులు తప్పకుండా ఆయిల్ ఫాం సాగు చేయాలి. ఈ రోజు నాచుపెల్లి గ్రామం లోని రైతులకు ఆయిల్ ఫాం సాగు గురించి వివరించడం జరిగింది. నాటిన నాలుగో సంవత్సరం నుండి ముప్పై ఏండ్ల వరకు పంట చేతికి రావడం జరుగుతుంది. పంట దిగుబడి సరాసరి 10-12 టన్నులు ఖాయాడం జరుగుతుంది. ఎకరానికి సరాసరిన ఒక లక్ష వరకు నికరాదాయం ఉంటుందని తెలుపడం జరిగింది. కోతుల బెడద మరియు వడగళ్ల వలన ఎలాంటి నష్టము ఉండదు. ఎకరానికి 57 మొక్కలు 90శాతం రాయితీతో ఒక మొక్కకి 20/- చొప్పున ఎకరానికి 1140/- డీడీ, డి హెచ్ ఎస్ ఓ,జగిత్యాల పేరున కట్టవలసి ఉంటుంది. డ్రిప్ పరికరాలు సన్నకారు మరియు చిన్న రైతులకు 90 శాతం రాయితీ,ఎస్సీ, ఎస్టి, రైతులకు 100 శాతం రాయితీతో జీఎస్టీ, మాత్రమే కట్టవలసి ఉంటుంది. మొదటి నాలుగు సంవత్సరములు 4200/- చొప్పున రైతులకు ప్రోత్సాహకం వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. పండించిన గెలలను మండలానికి కేటాయించిన కలెక్షన్ సెంటర్ నందు రైతు విక్రయించాల్సి ఉంటుంది. గేలలను విక్రయించిన 3-5 రోజులలో రైతు బ్యాంక్ ఖాతాలలో డబ్బులు కంపెనీ జమ చేయడం జరుగుతుంది.కావున అవసం ఉన్న రైతులు మండల వ్యవసాయ అధికారి, కొడిమ్యల మరియు వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించగలరు.



