రాయికల్

ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్న జాతీయవాద ఆదర్శ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం భగవద్గీత ప్రదానం

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది... డి.ఈ.వో. డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి

viswatelangana.com

March 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ మండలంలోని యం.పి.పి.ఎస్ చెర్లకొండాపూర్ లో పని చేస్తున్న యస్.జి.టి ఉపాధ్యాయుడు దొంగ జితేందర్ రెడ్డి తను పని చేస్తున్న పాఠశాలలోనే తన ఇద్దరు కుమారులైన శ్రావణ్ దీప్ రెడ్డి, కరణ్ దీప్ రెడ్డి పిల్లలను గత ఐదు సంవత్సరం లు గా చదివిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుండడంతో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా శాలువాతో సత్కరించి భగవద్గీత ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డి.ఈ.వో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి, పరిరక్షణకు అందరు సమిష్టి కృషి చేయాలని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులందరు జితేందర్ రెడ్డి ఆదర్శంగా తీసుకుని తమతమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ విద్యపై విశ్వసనీయత పేరుగుతుందని అన్నారు. ఆర్.యు.పి.పి.టి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పిల్లలందరినీ తప్పని సరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా ఉత్తర్వులు జారీ చేయాలని లేనిచో ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించడం ద్వారా ప్రభుత్వ విద్య మరింత మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు. దనవంతులతో పోల్చుకుంటూ హోదాకోసం ఒకరిని చూసి మరొకరు పోటీతత్వంతో నిరుపేదలైనప్పటికినీ అప్పులు చేసి ప్రైవేటు స్కూల్లలో చదివిస్తూ అప్పులపాలౌతున్ననారని, ప్రైవేటు వ్యవస్థలో బట్టి విధానంతో తాత్కాలికంగా ర్యాంకులు సాధిస్తున్నప్పటికినీ విద్యార్థులు సర్వాంగీణ వికాసం సాధించడంలేదని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను అభ్యసిస్తూ సర్వాంగీణ వికాసం పొందుతారని, తద్వారా ఆదర్శవంతమైన జీవన విధానం, జాతీయ భావన, సమయస్పూర్తి, దేశభక్తి భావన పెరుగుతుందని అన్నారు. జితేందర్ రెడ్డి జాతీయ భావన, తమ పిల్లలను తను చదువు చెప్పుచున్న పారశాలలో చదివించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు అన్యారంభట్ల సూర్యనారాయణ, చంద సత్యనారాయణ, లక్కాడి రాజరెడ్డి, పుర్రె శ్రీనివాస్, కొంగరి సాయికృష్ణ, తెడ్డు నరేష్, కోమాకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button