స్కానింగ్ సెంటర్ ల ఆకస్మిక తనిఖీ

viswatelangana.com
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ చేసి ఆడ, మగ అని చెప్పడం చట్టరీత్యా నేరమని మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కోరుట్ల లోని స్కానింగ్ సెంటర్లను, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ మిషన్స్ మరియు డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకున్న విధంగానే ఉన్నాయా అని నిర్ధారించుకున్నారు. ఫారం ఎఫ్ లు ప్రతినెల 5వ తారీఖు లోపు వారికి కేటాయించబడిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రo , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఐలాపూర్ లలో సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశించారు. ఫారం ఎఫ్ లు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఒకే విధంగా ఉండాలన్నారు. లింగ నిర్ధారణ చేసేటప్పుడు పేషంట్లకు కనపడే విధంగా ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు – లింగ నిర్ధారణ చేసినచో కఠిన చర్యలు తీసుకోబడతాయి అను ఫ్లెక్సీ బోర్డులు, ఫోం బోర్డులు ఏర్పాటు చేయవలెనని డాక్టర్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించి లింగ నిర్ధారణ చేసినచో జరిమానా విధించబడడమే కాకుండా గర్భిణీ మినహా ప్రోత్సహించిన వారిపై కూడా జరిమానా మరియు మూడు నెలల జైలు శిక్ష కూడా ఉంటుందని, వైద్యుల యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దుపరిచబడతాయని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై నోటీసులు జారీ చేయబడతాయి. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్, ఆరోగ్య విస్తర్ణ అధికారి రాజేశం, హెల్త్ సూపర్వైజర్ ఇండివర శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.



