కోరుట్ల

ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ , స్వచ్ఛత పక్వడా కార్యక్రమాలలో పాల్గొన్న జువ్వడి నర్శింగ్ రావు…….

viswatelangana.com

September 4th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ప్రాథమిక పాఠశాల (యస్ ఆర్ యస్ పి క్యాంప్) గడి కోరుట్లలో బుధవారం రోజున సీఎం బ్రేక్ ఫాస్ట్, స్వచ్ఛత పక్వడా కార్యక్రమంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్శింగ్ రావు పాఠశాల విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ (టిఫీన్)విద్యార్థులకు పెట్టి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కావున పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థి ఆకలితో ఉండవద్దని అలాగే వారి సంపూర్ణ ఆరోగ్య ఎదుగుదల కొరకై ప్రారంభించిన మంచి కార్యక్రమం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం అని కొనియాడారారు. గడి పాఠశాలను ఆదర్శంగా తీసుకొని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత పక్వడా కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటారు. నర్శింగ్ రావుకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పోతుగంటి మంగ, ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పోతుగంటి మంగ, కౌన్సిలర్ లు తిరుమల గంగాధర్, ఎంభేరి నాగభూషణం, సంఘ లింగం, పుప్పాల ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జగన్నాథం, లక్ష్మణ్, మండల విద్యాధికారి నరేశం, ఉపాద్యాయులు పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, యస్మిన్ ఫాతిమా, దనలక్మి విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button