కోరుట్ల

కల్లూరు మోడల్ స్కూల్, గర్ల్స్ హాస్టల్ లో పలు ఉద్యోగ అవకాశాలు

viswatelangana.com

August 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు మోడల్ స్కూల్, గర్ల్స్ హాస్టల్ లో ఏఎన్ఎం అలాగే వంట సిబ్బంది పోస్టుల భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరణ, ఏఎన్ఎం పోస్టుకు ఒక్కరూ, హెడ్ కుక్ కు ఒక్కరూ, అసిస్టెంట్ కుక్ ఒక్కరూ, నైట్ వాచ్ ఉమెన్ ఒక్కరూఅనుభవం కలిగిన మహిళ అభ్యర్థులు ఈనెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు కేజీబీవీ కల్లూరు, కోరుట్లలో దరఖాస్తులు సమర్పించగలరు. ఏఎన్ఎం పోస్టుకు అర్హతలు ఇంటర్, ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం ట్రైనింగ్, ఆర్.జి ఎన్ఎమ్ ట్రైనింగ్, హెడ్ కుక్ పదవ తరగతి ఉండాలని, అసిస్టెంట్ కుక్ ఏడవ తరగతి వరకు నైట్ వాచ్ వుమన్ ఏడవ తరగతి చదివి ఉండాలని, అర్హులైన మహిళలు బయోడేటా ఫారంతో పాటు ఎస్ఎస్సి మెమో, ఏడో తరగతి మేమో సంబంధిత సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోగలరు. స్థానికులకు ప్రాధాన్యత కలదు. మరిన్ని వివరాలకు కె. సుమలత (ఫోన్ నెంబర్ : 7780775410) స్పెషల్ ఆఫీసర్ కేజీబీవీ కోరుట్ల వారిని సంప్రదించగలరు.

Related Articles

Back to top button