కోరుట్ల
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష మండల విద్యాధికారి గంగుల నరేష్

viswatelangana.com
March 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణం మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని మండల విద్యాధికారి గంగుల నరేష్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన తొమ్మిది సెంటర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు వ్రాసినట్లు స్క్వాడ్ అధికారులు పలు సెంటర్లను పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 1618 మందికి మొత్తం మంది హాజరయ్యారని ప్రైవేట్ లో పది మంది విద్యార్థులకు గాను ఇద్దరు హాజరు కాలేరని ఆయన పేర్కొన్నారు. రేపు నిర్వహించబోయే హిందీ పరీక్షకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాలను సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు..



