కొడిమ్యాల
ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు

viswatelangana.com
February 19th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో నేషనల్ సెంటర్ ఫర్ షెనాన్సియల్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ఆర్థిక అక్షరాస్యత పై సీనియర్ సిటిజన్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కొడిమ్యాల విడ్స్ సీఎఫ్ఎల్ కౌన్సిలర్ శంకర్ సీనియర్ సిటిజన్లకు పొదుపు యొక్క ఆవశ్యకత, బ్యాంకు ఖాతాల రకాలు, డిపాజిట్స్ రకాలు, ఆదాయం, ఖర్చులు, బడ్జెట్ కేటాయింపు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం,పీఎంఎస్బివై, పీఎంజేజేబివై, కేసీసి లోన్, డెబిట్, క్రెడిట్ వాటి గురించి, డిజిటల్ అరెస్టు సైబర్ క్రైమ్ తదితర అంశాల పట్ల వీడియోల రూపంలో చూపించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు శంకర్, కృష్ణవేణి, నరేష్, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.



