ఉపాధి కూలీ కార్మికులకు సఖి సేవా కార్య క్రమాలపై అవగాహన

viswatelangana.com
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి వాణిశ్రీ ఆదేశాల మేరకు మెట్పల్లి మండలం చింతల పెట్, జగిత్యాల రూరల్ గుల్లపేట గ్రామపంచాయతీ పరిధిలో, ఉపాధి హామీ పని జరిగే పని ప్రదేశాలలో తేజస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సఖి కేంద్రం సేవల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అయినది. ప్రస్తుతం సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపులు, హింసలను నిరోధించడానికి సఖి కేంద్రం అండగా ఉంటుందని తెలపడం జరిగింది. ప్రజలకు సమాజంలో జరుగుతున్న అనర్థాలకు కారణాల గురించి వివరించగా ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల గురించి వివరిస్తూ, మొబైల్ వినియోగం గురించి క్లుప్తంగా వివరించడం, లింగ సమానత్వం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. సఖి కేంద్రం యొక్క ఉపయోగాల గురించి కూడా వివరిస్తూ, గృహింస, పనిచేసే చోట లైంగిక వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు మొదలైన హింసల నుండి రక్షణ కల్పించడం వారికి అవసరమైన సహాయాలను, సలహాలను 24/7, ఒకే గొడుగు కింద ఐదు రకాల సేవలను సఖి కేంద్రం ద్వారా అందించడజరుగుతుందని, ఎలాంటి హింసకు గురైన, సఖి సెంటర్ ను నేరుగా గాని హెల్ప్ లైన్ ద్వారా గాని ఆశ్రయించ వచ్చని తెలపడం జరిగింది. మహిళ హెల్ప్ లైన్ నెంబర్ 181, గురించి వివరించడం జరిగింది. సఖి సెంటర్ అడ్మిన్ మనీలా, శారద గ్రామపంచాయతీ సెక్రటరీ భార్గవి, ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.



