ఎంపీయల్ – 3 ముగింపు వెడుకల్లో విజేతలకు బహుమతులు అందజేసిన.. సుజిత్ రావు

viswatelangana.com
మల్లాపూర్ మండల కేంద్రంలో గత కొద్దిరోజుల నుండి జరుగుతున్న మల్లాపూర్ మండల ప్రిమీయర్ లీగ్ -3వ సీసన్ చివరి దశకు చేరకుకోవడంతో ముఖ్య అతిధిగా పాల్గొన్న టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అనంతరం ఫైనల్ మ్యాచ్ హారహోరిలో స్టార్ ఇఎన్టి హాస్పిటల్ టీం పైన సామ నైట్రైడర్స్ టీం గెలవడం జరిగింది. సుజిత్ రావు మాట్లాడుతూ ఎంపీయల్ నిర్వహించిన ఆర్గనైజషన్ సభ్యులు అలాగే టీం ఓనర్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత చక్కటి మంచి టాలెంట్ కల్పించిన ఎంపీయల్ నిర్వహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విజేతలకు, రన్నర్ టీం లకు శుభఅభినందనలు తెలిపారు. ఇలాగే ముందు ముందు మంచి కార్యక్రమలు నిర్వహించుకోవాలని ఇలాగే మండల స్థాయి కాకుండా నియోజకవర్గ స్థాయిలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి దానికి నేను కృషి చేస్తాను అని, రానున్న రోజుల్లో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకుందమని, మండల స్థాయిలో కాకుండా నియోజకవర్గ స్థాయిలో మల్లాపూర్ మండలం నుండి కప్పు గెలువాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీయల్ చైర్మన్, నిర్వహకులు, టీం ఓనర్స్ అలాగే చైర్మన్ మెహబూబ్ ఖాన్, టీం ఓనర్స్ పుల్లూరి రాము, రఫీ, గడ్డం శ్రీను, కనుక సంజీవ్, బద్దం శేఖర్, రాజేందర్, ఎండీ షకీల్, గౌతమ్, సామ రాకేష్ అలాగే ఆర్గనైజర్స్ బండి స్వామి గౌడ్, గుండేటి శ్రీను, మేకల సతీష్, ముసక్కరి రాకేష్, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కో ఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, టీపీసీసీ ఫిషర్మన్ ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతీ, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, నియోజకవర్గం ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్, వెంకట గిరి, ఎండీ జాఫర్, మామిడి రాజశేఖర్ రెడ్డి, ఇప్పపెల్లి గణేష్, కోరే రాజు, దాస్, సుమన్, నోముల సోమరెడ్డి, మొగిలి రాజేందర్, గోపిడి నరేష్, సల్మాన్ ఖాన్, ముద్దం ప్రశాంత్, సమీర్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.