కోరుట్ల

పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్

viswatelangana.com

April 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

గత కొద్దిరోజులుగా కొంత మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయంపై కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో స్పందించారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల బాగు కోసం పని చేసే పార్టీ. కొందరు అవకాశవాదులు పార్టీ మారితే జరిగే నష్టం ఏంలేదు. కానీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల తరుపున కొట్లాడాల్సింది పోయి. అధికారం లేకుంటే బతకలేని పరిస్థితిలో ఉండుడు కేవలం అది వారి స్వప్రయోజనం తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. 70 ఏండ్ల వయసులో కేసీఆర్ వారికి కాలుకు ఆపరేషన్ అయినప్పటికీ విశ్రాంతి లేకుండా రైతులకోసం పోరాడుతున్నారు అని. ఈ కష్ట కాలంలో తెలంగాణ ప్రజల తరువున పోరాడుతున్న కేసీఆర్ తో అందరు ఉండాల్సింది పోయి. స్వప్రయోజలంకోసం పార్టీ మారడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీజేపీతో పొత్తు ఒప్పందానికి వ్యతిరేకంగా ఉన్న కారణంగా కేసీఆర్ మీద కోపంతో కవిత ని అరెస్ట్ చేసి జైల్లో వేసిన సందర్బం మనం చూస్తున్నాం, ఏ తప్పు చేయని కవిత త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకి వస్తారని అన్నారు. గతంలో 2009, 2010లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో చాల మంది బిఆర్ఎస్ నాయకులని ప్రలోభ పెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్నరు. ఆ సమయంలో కొద్దీ మంది నాయకులతో వందలాది మంది కార్యకర్తలతో రెండు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచామని గుర్తు చేసారు. ప్రజల మంచి కోసం పని చేయాలనీ తపన ఉంటె మనకు ప్రజలే అండగా ఉంటారు, ఇలాంటి అవకాశవాద నాయకులు పోతే మనకు ఎం ఇబ్బంది లేదు. ఇప్పటికి మనతో వెలది మంది కరుడుగట్టిన తెలంగాణ వాదులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న నాయకులని సర్పంచులుగా, ఎంపిటిసిలుగా గెలిపించుకునే బాధ్యత నాదని అందరు భరోసాగా ఉండాలని కోరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం అందరు కలిసికట్టుగా పని చేయాలనీ. కాంగ్రెస్, బీజేపీ పై ఉన్న ప్రజావ్యతిరేకతతో, రైతు వ్యతిరేక విధానాలతో, అబద్దపు మోసాలతో. బీసీ బిడ్డలని కండోమ్ లు అమ్ముకోండని కాంగ్రెస్ కుట్రపూరిత అహంకార మాటలకూ వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని. వారికి బుద్ది చెప్పే సమయం కాబట్టి తమందరు బాజిరెడ్డి గెలుపు కోసం పని చేయాలనీ వేడుకున్నారు. భవిష్యత్ బీఆర్ఎస్ దేనని ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ కి ఓట్ వేసి తప్పు చేసాం అని అనుకుంటున్నారని. మనం అందరం ప్రజలు తరుఫున పోరాడాలని కోరారు…

Related Articles

Back to top button